Sesame Oil For Beauty : నువ్వుల నూనెను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంతో మీ అందం రెండింత‌లు అవుతుంది..!

Sesame Oil For Beauty : మ‌నం వంటల్లో, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో నువ్వుల నూనెను విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. నువ్వుల నూనెను వంటలల్లో వాడ‌డం వ‌ల్ల వంటలు, ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ప‌చ్చ‌ళ్లు చాలా కాలంపాటు నిల్వ ఉంటాయి. అలాగే నువ్వుల నూనెలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. నువ్వుల నూనె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఆయుర్వేదంలో కూడా నువ్వుల నూనెనే ఎక్కువ‌గా ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అయితే కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాదు మ‌న చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా నువ్వుల నూనె ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. నువ్వుల నూనెను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌డ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. చ‌ర్మానికి సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ బి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐర‌న్, ఫాస్ప‌ర‌స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. నువ్వుల నూనెతో చ‌ర్మానికి మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల సూర్మ కిర‌ణాల నుండి హానిక‌ర‌మైన యువి కిర‌ణాల నుండి చ‌ర్మానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. చ‌ర్మం న‌ల్ల‌గా మార‌కుండా ఉంటుంది. అంతేకాకుండా చ‌ర్మ క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే నువ్వుల నూనెలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. క‌నుక చ‌ర్మానికి నువ్వుల నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్స్ త‌గ్గ‌డంతో పాటు రాకుండా ఉంటాయి. ఈ నువ్వుల నూనెను త‌ల‌కు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టుకు పోష‌ణ క‌ల‌గ‌డంతో పాటు త‌ల చ‌ర్మానికి కూడా మేలు క‌లుగుతుంది.

Sesame Oil For Beauty how to use it for facial glow
Sesame Oil For Beauty

అలాగే నువ్వుల‌తో చ‌క్క‌టి స్క్ర‌బ‌ర్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై పేరుకపోయిన న‌లుపు, ట్యాన్ తొల‌గిపోతుంది. చ‌ర్మం యొక్క రంగు మెరుగుప‌డుతుంది. ఈ స్క్ర‌బ్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ముందుగా ఒక జార్ లో నువ్వులు, ఎండిన పుదీనా ఆకులు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం, తేనెక‌లిపి ముఖానికి, చేతుల‌కు రాసుకోవాలి. దీనిని త‌డి ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత గోరు వెచ్చ‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉడే న‌లుపు, మృత‌క‌ణాలు, ట్యాన్ అంతా తొల‌గిపోతుంది. చ‌ర్మం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా నువ్వుల నూనె మ‌న ఆరోగ్యంతో పాటు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న చ‌క్క‌టిఆరోగ్యక‌ర‌మైన చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts