Korrala Payasam : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌.. ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం.. త‌యారీ ఇలా..!

Korrala Payasam : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కొర్రల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాలను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ కొర్ర‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కొర్ర‌ల‌తో రుచికర‌మైన పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్ర‌ల పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – ఒక క‌ప్పు, 4 గంట‌ల పాటు నాన‌బెట్టిన కొర్ర‌లు -అర క‌ప్పు, చిక్క‌టి వేడి పాలు – ఒక క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, ప‌చ్చ క‌ర్పూరం – చిటికెడు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ -త‌గిన‌న్ని.

Korrala Payasam recipe in telugu make in this method
Korrala Payasam

కొర్ర‌ల పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక కొర్ర‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి కొర్ర‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. కొర్ర‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత పాలు పోసి క‌ల‌పాలి. దీనిని కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత బెల్లం వేసి క‌ల‌పాలి. బెల్లం మొత్తం కరిగిన త‌రువాత ప‌చ్చ క‌ర్పూరం, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని నెయ్యితో స‌హా పాయసంలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొర్ర‌ల పాయ‌సం త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బియ్యంతోనే కాకుండా కొర్ర‌ల‌తో కూడా రుచిక‌ర‌మైన పాయసాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts