ఆధ్యాత్మికం

ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే.. దుష్టశక్తులు పోతాయి..!

చాలామంది ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. కర్పూరం మనకి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము. కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది.

ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలం పూజకి మాత్రమే కాదు కర్పూరం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కర్పూరాన్ని దేవుడి వ‌ద్ద‌ వెలిగించి మామూలుగా హారతి పాట పాడడం లేదంటే శ్లోకాలని చదవడం వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇంటికి ఇన్ని లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. ఇంటి వాతావరణం కర్పూరంతో శుద్ధి చేయబడుతుంది. దుష్ట శక్తులు తొలగిపోతాయి. కర్పూరం నుండి వెలువడే పొగ మరియు వాసన ఎంతో మేలు చేస్తాయి.

light camphor in home to remove evil spirits

కర్పూరం ఇంట్లో వెలిగిస్తే సంపద బాగా పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే పొగ నెగెటివ్ ఎనర్జీని సులభంగా తొలగించగలదు. కర్పూరం వలన కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడొచ్చు. అప్పుడప్పుడు మనకి మనసులో బాధ లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వలన చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి.

సంతోషాన్ని మిస్ అవుతూ ఉంటాము. అటువంటప్పుడు ఇంట్లో క‌ర్పూరాన్ని వెలిగించండి. అలా కర్పూరంని వెలిగించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోతుంది. మంచి జరుగుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. ఎంతో హాయిగా ఉండొచ్చు. ఏ సమస్య కూడా ఉండదు.

Admin

Recent Posts