సాధారణంగా మనం పడుకున్నప్పుడు మన కలలో ఏవేవో కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మనకు మంచి జరిగినట్లు కల వస్తే మరికొన్నిసార్లు ప్రమాదాలు జరిగినట్లు, చెడు జరిగినట్లు కలలు వస్తుంటాయి. అయితే ఈ విధంగా కలలు రావడం వల్ల అవి నిజంగానే జరుగుతాయానీ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే కొందరికి కలలో తరచు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. నీళ్లు కనిపించడం వల్ల వారికి ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
కలలో మనకు పారుతున్న నీరు కనపడితే శుభ ఫలితాలను పొందుతారు. కానీ సముద్రం కనపడే అందులో అలలు ఎగిసి పడుతూ కనిపిస్తే మన జీవితంలో ఏదో ఆందోళనకర సమస్య రాబోతోందని అర్థం. అదేవిధంగా కొందరికి కలలో వరద నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ విధంగా వరద నీరు కనపడితే మనం త్వరలోనే చెడు వార్త వింటారనీ సంకేతం.
కలలో వర్షం నీరు కనపడితే అది శుభ సంకేతం. కొలనులో అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు కలలో కనపడితే మన జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. అదేవిధంగా బావిలోని నీరు హఠాత్తుగా పెరుగుతున్నట్టు కనబడితే మన జీవితంలో కూడా అదృష్టం అనుకోకుండా వస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా మీరు వివిధ రూపాలలో కనిపించడం వల్ల వివిధ పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పవచ్చు.