Little Millet Dosa : చిరుధాన్యాల్లో మేటి సామ‌లు.. వాటితో దోశ‌లు వేసుకుని తింటే రుచి.. ఆరోగ్యం..!

Little Millet Dosa : చిరుధాన్యాలు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో సామ‌లు ఒక‌టి. వీటినే ఇంగ్లిష్ లో లిటిల్ మిల్లెట్స్ అంటారు. వీటిల్లోనూ అనేక పోష‌కాలు, అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి. అయితే సామ‌లను ఎలా తినాలి ? అని ఆలోచిస్తున్న‌వారు వాటిని దోశ‌ల రూపంలో వేసుకుని తీసుకోవ‌చ్చు. ఇవి రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక సామ‌ల దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఆ దోశ‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Little Millet Dosa  an easy way to make it very healthy
Little Millet Dosa

సామ‌ల దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సామ‌లు – మూడు క‌ప్పులు, మిన‌ప ప‌ప్పు – ఒక క‌ప్పు, మెంతులు – పావు టీ స్పూన్‌, అటుకులు – 2 టీ స్పూన్స్‌, ఉప్పు – త‌గినంత, నూనె – అర క‌ప్పు.

సామ‌ల దోశ త‌యారీ విధానం..

సామ‌లు, మిన‌ప పప్పు, మెంతుల‌ను క‌లిపి నాలుగు నుండి ఐదు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. అటుకుల్ని పిండి రుబ్బేందుకు ప‌ది నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలు. త‌రువాత అన్నింటినీ క‌లిపి జార్ లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని స‌రిప‌డా ఉప్పు క‌లిపి నాలుగైదు గంట‌లు ప‌క్క‌న ఉంచాలి. త‌రువాత స్ట‌వ్‌ మీద పెనం పెట్టి గంటెతో పిండిని తీసుకుని దోశ‌లా ప‌రిచి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చాలి. దీంతో సామ‌ల దోశ త‌యార‌వుతుంది. దీన్ని ప‌ల్లీలు లేదా కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

సామ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. హైబీపీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా ఎన్నో లాభాల‌ను వీటి వ‌ల్ల పొంద‌వ‌చ్చు.

D

Recent Posts