వినోదం

Naga Chaitanya : నాగ చైత‌న్య జీవితాన్నే మార్చేసిన మ‌హేష్ బాబు.. ఎలాగో తెలుసా..?

Naga Chaitanya : అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చివ‌రిగా చైతూ న‌టించిన థాంక్‌యూ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. అయితే నాగ చైత‌న్య కెరీర్‌ని మార్చేసిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమా అస‌లు ముందుగా మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. ఆయ‌న నో చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ చైతూ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం, ఈ సినిమాతో కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డం జ‌రిగింది.

ఏ మాయ చేశావే మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ కథను తొలిసారిగా మహేశ్ బాబుకే వినిపించిన‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. ముందుగా మంజులకు ఈ కథ గురించి చెప్పాడట. కథ బాగుంది కానీ మహేశ్ చేస్తాడో.. లేదో.. అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మంజుల తెలిపినట్లు సమాచారం. తర్వాత ఈ కథను మహేశ్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా.. అని అనేశాడట. మహేశ్ బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయని నో చెప్పాడ‌ట‌.

mahesh babu changed life of naga chaitanya

అయితే ఏదైనా యాక్షన్ కథ చేద్దామని మహేశ్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ మూవీని మహేశ్ చేసి ఉంటే పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ తెలిపాడు. ఇక అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారిగా జోడీ కట్టి, హిట్ కొట్టి, ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ మూవీ ఎంతపెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ త‌మిళ్ లో శింబు తో తెర‌కెక్కించాడు. అక్క‌డ జెస్సీ పాత్ర‌లో త్రిష హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

Admin

Recent Posts