వినోదం

శంక‌ర్ ఓ సినిమా చేయ‌మ‌ని అడిగితే.. నో చెప్పిన మ‌హేష్ బాబు.. ఎందుకంటే..?

దర్శకులందరిలోనూ డైరెక్టర్ శంకర్ స్టామినానే వేరు. విభిన్నమైన కథాంశంతో చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తారు. శంకర్ డైరెక్షన్ లో చిత్రం వస్తుందంటే చాలు కొత్త కథాంశం రాబోతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రచయితగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను రూపొందించారు శంకర్. జెంటిల్ మాన్ చిత్రంతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయాలను అందుకున్నారు.

ఐ, ఇండియ‌న్ 2 తప్ప ఆయన పని చేసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను సాధించాయి. శంకర్ చిత్రాలు అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. రోబో చిత్రంతో మన ఇండియా చిత్రాల‌ను హాలీవుడ్ లెవెల్‌లో పరిచయం చేశారు శంకర్. శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజ‌ర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Rc15 శంకర్ దర్శకత్వం వహిస్తున్న‌ తొలి తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కీయారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న 50వ చిత్రం.

mahesh babu said no to shankar movie

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గాను ఎం ఎస్ థ‌మన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పనుల‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. అసలు విషయానికి వస్తే ఒక కథ విషయంలో శంకర్ మహేష్ బాబుతో చర్చలు జరిపారట. శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు చిత్రానికి ముందుగా లీడ్ రోల్ లో నటింపజేయడానికి మహేష్ బాబుని సంప్రదించారట.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన త్రీ ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్ పాత్రలో నటించడానికి చర్చ జరగగా, ఈ పాత్ర తనకు సెట్ కాద‌ని నో చెప్పాను అని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఆ పాత్ర త‌న‌కు స‌రిపోద‌నే మ‌హేష్ ఆ మూవీని రిజెక్ట్ చేశార‌ట‌. అయితే శంక‌ర్‌, మ‌హేష్ ల కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ ఏదైనా మూవీ వ‌స్తుందేమో చూడాలి.

Admin

Recent Posts