Instant Dosa : పెరుగుతో అప్ప‌టిక‌ప్పుడు త‌యారుచేసుకునే ఇన్‌స్టంట్ దోశ‌.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Instant Dosa : దోశ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో కూడా మ‌న‌లో చాలా మందికి తెలుసు. దోశల త‌యారీకి మ‌నం ముందు రోజే మిన‌ప ప‌ప్పును త‌గినంత స‌మ‌యం నాన‌బెట్టి పిండిలా చేసుకోవాలి. ఇలా చేసుకోవ‌డం అంద‌రికీ సాధ్యం కాక బ‌య‌ట దొరికే రెడీ మిక్స్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. వీటి అవ‌స‌రం లేకుండా మ‌న ఇంట్లోనే దోశ‌ను ఇన్‌స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ను త‌క్కువ స‌మ‌యంలో త‌క్కువ ప‌దార్థాల‌తోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్‌స్టాంట్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దోశ‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Instant Dosa with curd quickly recipe here
Instant Dosa

ఇన్ స్టాంట్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – 2 క‌ప్పులు, పెరుగు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నూనె – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – స‌రిప‌డా.

ఇన్ స్టాంట్ దోశ త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, పెరుగు, స‌రిప‌డా ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు స‌రిప‌డా నీటిని పోస్తూ దోశ పిండిలా చేసుకోవాలి. త‌రువాత పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ పిండిని దోశ‌లా వేసుకోవాలి. ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు ఈ దోశ‌ను రెండు దిక్కులా కాల్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అప్ప‌టికప్పుడు ఎంతో రుచిగా ఉండే దోశ త‌యార‌వుతుంది. ఈ దోశ‌ల‌ను ప‌ల్లీ చ‌ట్నీ లేదా కొబ్బ‌రి చ‌ట్నీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

D

Recent Posts