Mamidikaya Pulihora : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో పులిహోర‌.. ఇలా చేస్తే ఎంతో రుచిగా వ‌స్తుంది..!

Mamidikaya Pulihora : వేస‌వి కాలంలో మ‌న‌కు లభించే వాటిల్లో ప‌చ్చి మామిడి కాయ‌లు ఒక‌టి. ప‌చ్చి మామిడి కాయలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అత్య‌ధికంగా ఉండే విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ లు హార్మోన్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. వేస‌వి కాలంలో శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌చ్చి మామిడి కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతోపాటు దంత స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి.

make Mamidikaya Pulihora in this way it will be very delicious
Mamidikaya Pulihora

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ప‌చ్చి మామిడి కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తాయి. ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ప‌చ్చి మామిడి కాయ పులిహోర ఒక‌టి. కొంద‌రికి ఈ మామిడి కాయ పులిహోర‌ను ఎంత ప్ర‌య‌త్నించినా రుచిగా త‌యారు చేయ‌డం రాదు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి మామిడి కాయ పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న‌వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

ప‌చ్చి మామిడి కాయ పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి మామిడి కాయ‌లు – 2 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), అన్నం – అర కిలో బియ్యంతో వండినంత‌, నూనె – 4 టేబుల్ స్పూన్స్‌, క‌రివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ఇంగువ – చిటికెడు, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 7 లేదా 8, ప‌సుపు – ఒక టేబుల్ స్పూన్‌, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్‌, జీల‌క‌ర్ర – అర‌ టీ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్‌, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మామిడి కాయ పులిహోర త‌యారీ విధానం..

ముందుగా మామిడి కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి పైన ఉండే చెక్కును తీసి స‌న్నని తురుముగా చేసుకోవాలి. మ‌న‌లో కొంద‌రు మామిడి కాయ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి గుజ్జుగా చేసి పులిహోర త‌యారీకి వాడుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మామిడి కాయ పులిహోర అంత రుచిగా రాదు. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక ప‌ల్లీల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకోవాలి. ప‌ల్లీలు వేగాక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర‌, ఆవాలు, శ‌న‌గ‌ప‌ప్పు వేయాలి. అవి వేగాక ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న మామిడి కాయ తురుమును వేసి కలుపుకోవాలి.

ఇందులో ప‌సుపు, రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి మామిడి కాయ తురుము ఉడికే వ‌ర‌కు ఉంచుకోవాలి. ఇలా ఉడికిన మామిడి కాయ తురుమును తీసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత మామిడి కాయ తురుములో ఉడికిన అన్నాన్ని వేసి మామిడి కాయ తురుము అన్నం అంత‌టికి ప‌ట్టేలా క‌లుపుకోవాలి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ప‌ల్లీల‌ను, కొత్తిమీరను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ పులిహోర త‌యార‌వుతుంది. దీనిని ఎవ‌రైనా చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా దీన్ని తిన‌డం వ‌ల్ల‌ మామిడి కాయ‌ల‌లో ఉండే పోష‌కాలు కూడా శ‌రీరానికి ల‌భిస్తాయి.

Share
D

Recent Posts