Mamidikaya Pachi Pulusu : మామిడికాయ ప‌చ్చి పులుసు ఇలా చేయండి.. అన్నంలో లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Mamidikaya Pachi Pulusu : మామిడికాయ ప‌చ్చి పులుసు… మామిడికాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్ల‌గా, కారంగా, క‌మ్మ‌గా ఉండే ఈ ప‌చ్చి పులుసును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడికాయ‌లు ల‌భించిన‌ప్పుడు వాటితో ఇలా రుచిక‌ర‌మైన ప‌చ్చి పులుసును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ ప‌చ్చి పులుసును చాలా సుల‌భంగా, క‌మ్మ‌గా త‌యారుచేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ ప‌చ్చి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ ప‌చ్చి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుల్ల‌టి మామిడికాయ – 1, ప‌చ్చిమిర్చి – 3, మెంతులు – పావు టీస్పూన్, ధ‌నియాలు -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, నువ్వులు – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్ లేదా త‌గినన్ని, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్.

Mamidikaya Pachi Pulusu recipe in telugu make in this method
Mamidikaya Pachi Pulusu

మామిడికాయ ప‌చ్చి పులుసు త‌యారీ విధానం..

ముందుగా మామిడికాయ‌ను పుల్కాల పెనం మీద ఉంచి న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే పెనం మీద ప‌చ్చిమిర్చిని కూడా వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మామిడికాయ‌పై ఉండే పొట్టును తీసేసి మామిడికాయ గుజ్జును క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో మెంతులు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో మామిడికాయ గుజ్జు, పచ్చిమిర్చి వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మిగిలిన ప‌దార్థాల‌ను కూడా వేసి క‌ల‌పాలి.

త‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి తాళింపు చేయాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చి పులుసులో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ప‌చ్చి పులుసు త‌యార‌వుతుంది. మామిడికాయ‌ను కాల్చ‌డం ఇష్టం లేని వారు వాటిని ఉడికించి కూడా తీసుకోవ‌చ్చు. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌చ్చి పులుసును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts