Mirapa Charu : మిరపచారు… ఎండుమిర్చితో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా రాగి సంగటితో తింటూ ఉంటారు. అలాగే ఈ చారు తయారీ విధానం కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ చారును రాగి సంగటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. 5 నిమిషాల్లోనే ఈ చారును మనం తయారు చేసుకోవచ్చు. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా రాగి సంగటిలోకి మిరప చారును తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే మిరపచారు తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపచారు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 4 లేదా కారానికి తగినన్ని, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, పాలు – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత.
మిరపచారు తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండుమిర్చిని వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిలా చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని అందులో పోసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరపచారు తయారవుతుంది. దీనిని రాగి సంగటితో చాలా రుచిగా ఉంటుంది. తరచూ కూరలే కాకుండా ఈ మిరపకాయలతో చారును తయారు చేసుకుని సంగటితో తినవచ్చు.