food

Munagaku Pachadi : ఈ ఆకుల‌ను ఇలా తింటే ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Munagaku Pachadi : కాల్షియం అనేది మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరానికి తగినంత కాల్షియం ఉన్నప్పుడే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. ఈ కాల్షియం లోపం వలన అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. నాలుగు మెట్లు ఎక్కడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాళ్లు నొప్పులు అనే సమస్యతో చిన్నవయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు దూరం చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో సదుపాయాలను కలుగజేసింది. ప్రకృతి మానవాళికి ఇచ్చిన వరంలో మునగాకు కూడా ఒకటి. మునగాకును రెగ్యులర్ గా ఆహారంగా తీసుకోవడం ద్వారా కాల్షియం లోపం తగ్గుతుంది. ఇప్పుడు మునగాకుతో ఒక అద్భుతమైన వంటకం ఎలా తయారు చేయాలో చూద్దాం.

మనం ఎక్కువగా మునగాకుతో పప్పు, పొడి చేసుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది. పొయ్యి మీద కళాయి పెట్టి ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల వేరు శనగ పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టాలి.

Munagaku Pachadi take regularly for health

ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ మీగడ వేసి వేడి చేశాక రెండు కప్పుల మునగాకు వేసి ఆకు మడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్ లో ముందుగా వేగించి పెట్టుకున్న మిశ్రమాలను మెత్తగా పొడిచేసి తర్వాత మునగాకు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం, కొంచెం పసుపు వేసి మరొకసారి మిక్సీ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ.

ఈ పచ్చడి తినటం వలన మన శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. అంతేకాకుండా కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఉండవు. అలాగే విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబంధించిన సమస్యలు కూడా త‌గ్గుతాయి.

Admin

Recent Posts