ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

సాధారణంగా పెళ్లైన మహిళలు తమ నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత, ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని బొట్టు పెట్టుకొంటారు. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక పెళ్లైన మహిళలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల తన భర్తకు ఆయుష్షును అందిస్తుందని భావిస్తారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ వేలితో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ శాస్త్రం ప్రకారం మన చేతి వేళ్లలో మధ్య వేలును శని స్థానంగా భావిస్తారు. శనిగ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్షును కలిగిస్తుంది. కనుక ఈ వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బొటన వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయి.

with which finger you have to wear bottu

చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది. మన శరీరంలో కేవలం నుదుటిపై మాత్రమే కాకుండా 15 స్థానాలలో బొట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలామంది ఎరుపు రంగు కుంకుమను నుదుటిపై పెట్టుకుంటారు. ఎందుకంటే నుదురు అంగారకుడి స్థానం. అదేవిధంగా అంగారకుడు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఎరుపు రంగు సింధూరం నుదుటిపై ధరించడం ఆనవాయితీగా వస్తోంది.

Admin

Recent Posts