Muskmelon Juice : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని త‌ర్బూజా జ్యూస్‌.. త‌యారీ ఇలా..!

Muskmelon Juice : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌ల్లో ఖ‌ర్బూజ పండ్లు కూడా ఒక‌టి. వీటిలో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఖ‌ర్బూజాల‌ను నేరుగా తిన‌డానికి బ‌దులుగా చాలా మంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఖ‌ర్బూజ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ జ్యూస్ ను ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఖ‌ర్బూజ‌జ్యూస్ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు వేస‌వితాపం నుండి ఉప‌శ‌మ‌నాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రుచిగా, చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే ఈ ఖ‌ర్బూజ జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఖ‌ర్బూజ జ్యూస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చియా విత్త‌నాలు – 2 టీ స్పూన్స్, స‌గ్గుబియ్యం – 3 టీ స్పూన్స్, పాలు – అర లీట‌ర్, పంచ‌దార – పావు క‌ప్పు, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, ఖ‌ర్బూజ – 1.

Muskmelon Juice here it is how to make it drink cool
Muskmelon Juice

ఖ‌ర్బూజ జ్యూస్ త‌యారీ విధానం..

ముందుగా చియా విత్త‌నాలను నీటిలో వేసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత స‌గ్గుబియ్యాన్ని కూడా నీటిలో వేసి ఒక గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఖ‌ర్బూజ‌పై ఉండే తొక్క‌ను తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ వేసి కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత గిన్నెలో పాలు, నాన‌బెట్టిన స‌గ్గుబియ్యం వేసి ఉడికించాలి. పాలు పొంగు వ‌చ్చిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగి, స‌గ్గుబియ్యం ఉడికిన త‌రువాత క‌స్టర్డ్ పౌడ‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని కొద్దిగా చిక్కబ‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ పాల‌ను ముందుగా త‌యారు చేసుకున్న ఖ‌ర్జూజ జ్యూస్ లో వేసి క‌ల‌పాలి. ఇందులోనే చియా విత్తనాలు కూడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు స‌ర్వింగ్ గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి అందులో జ్యూస్ పోసి పైన డ్రై ఫ్రూట్స్ ప‌లుకుల‌ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఖ‌ర్జూజ జ్యూస్ త‌యార‌వుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. వేడి నుండి ఉప‌వ‌మ‌నం కూడా క‌లుగుతుంది.

D

Recent Posts