Magnesium Foods : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. కండరాల పనితీరుకు, నరాల పనితీరుకు, శరీరంలో శక్తి ఉత్పత్తికి, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. వీటితో పాటు శరీరంలో అనేక విధులను నిర్వర్తించడంలో కూడా మెగ్నీషియం మనకు అవసరమవుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఆహారాలను మన రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మెగ్నీషియం క్యాప్సుల్స్ ను వాడే అవసరం కూడా ఉండదు.
మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగ్నీషియం ఎక్కువగా ఉండే వాటిలో బచ్చలికూర ఒకటి. బచ్చలికూరను సలాడ్స్, స్మూతీస్, వంటి వాటితో పాటు పప్పుగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. బాదంపప్పులో కొవ్వులు, ప్రోటీన్ లతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు తగినంత మెగ్నీషియం లభిస్తుంది. గుమ్మడి గింజలల్లో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సలాడ్స్, ఓట్ మీల్ వంటి వాటితో గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం రాకుండా ఉంటుంది. అలాగే బ్లాక్ బీన్స్ లో కూడా మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సూప్, సలాడ్స్,టాకోస్ వంటి వాటితో బ్లాక్ బీన్స్ ను కలిపి తీసుకోవడం వల్ల మెగ్నీషియంతో పాటు ప్రోటీన్స్, ఫైబర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే అవకాడోలో కూడా తగిన మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. టోస్ట్, సలాడ్, స్మూతీ వంటి వాటితో అవకాడోను తీసుకోవడం వల్ల మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. డార్క్ చాక్లెట్ లో కూడా మెగ్నీషియం ఉంటుంది.
అయితే ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే అధిక మొత్తంలో కోకో ఉండే డార్క్ చాక్లెట్ ను ఎంచుకోవడం మంచిది. అలాగే అరటిపండ్లల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది. అరటిపండ్లతో సలాడ్, స్మూతీ, మిల్క్ షేక్ వంటి వాటిని తయారు చేసి తీసుకోవడం వల్ల తగినంత మెగ్నీషియం లభిస్తుంది. అదే విధంగా క్వినోవాలో కూడా మెగ్నీషియం ఉంటుంది. సలాడ్స్, స్టిర్ ఫ్రైస్, కూరగాయలతో కలిపి ఈ క్వినోవాను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రోటీన్స్ తో పాటు సోయాబీన్స్ లో మెగ్నీషియం కూడా ఉంటుంది. వీటిని ఉడికించి కూరగా వండి తీసుకోవడం వల్ల, సలాడ్స్ వంటి వాటిలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మెగ్నీషియం లభిస్తుంది. అలాగే ఎంతో రుచిగా ఉండే జీడిపప్పులో కూడా మెగ్నీషియం ఉంటుంది. జీడిపప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల తగినంత మెగ్నీషియం లభిస్తుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మెగ్నీషియం లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.