Mutton Pulao In Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో మ‌ట‌న్ పులావ్‌ను ఎంతో ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Mutton Pulao In Cooker : మ‌టన్.. దీనిని కూడా మ‌న‌లో చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మ‌ట‌న్ లో ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు ఎన్నో ఉంటాయి. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ పులావ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పవ‌ల‌సిన ప‌ని లేదు. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో మ‌ట‌న్ పులావ్ ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. మ‌ట‌న్ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

ఈ పులావ్ ను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. రుచిగా ఉండ‌డంతో పాటు త‌క్కువ శ్ర‌మ‌తో దీనిని మ‌నం కుక్క‌ర్ లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట లేసుకుంటూ తినేలా ఉండే ఈ మ‌ట‌న్ పులావ్ ను కుక్క‌ర్ లో సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mutton Pulao In Cooker very easy to make know the recipe
Mutton Pulao In Cooker

మ‌ట‌న్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 5, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, బిర్యానీ ఆకు – 1, యాల‌కులు – 5, న‌ల్ల యాల‌క్కాయ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కారం గ‌ల త‌రిగిన ప‌చ్చిమిర్చి – 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, ఉప్పు నీటిలో 2 గంట‌ల పాటు నాన‌బెట్టిన మ‌ట‌న్ – 300 గ్రా., ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ప‌సుపు – రెండు చిటికెలు, నీళ్లు – 325 ఎమ్ ఎల్, త‌రిగిన పుదీనా – చిన్న క‌ట్ట‌, త‌రిగిన కొత్తిమీర – చిన్న క‌ట్ట‌, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, రోజ్ వాట‌ర్- ఒక టీ స్పూన్.

మ‌ట‌న్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి రాగానే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. మ‌ట‌న్ ను 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. మ‌ట‌న్ ముదురుగా ఉండే మ‌రో 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో మ‌రో క‌ప్పు నీళ్లు పోసి స్ట‌వ్ ఆన్ చేయాలి.

త‌రువాత ఇందులో పుదీనా త‌రుగు, కొత్తిమీర త‌రుగు, బియ్యం, త‌గినంత ఉప్పు, రోజ్ వాట‌ర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత‌ను ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత మూత తీసి అంతా ఒక‌సారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ ఇలా చాలా సుల‌భంగా మ‌ట‌న్ పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts