lifestyle

Neelakurinji Flowers : 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు..

Neelakurinji Flowers : ప్ర‌కృతిని చూసి ప‌ర‌వ‌శించని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని అందాలు మ‌న మ‌న‌స్సుని ఎంతో ఉత్తేజింప‌జేస్తాయి. అయితే ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి. నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం..సొగసు..మృగ్ధ మనోహర రూపం వాటిది. కొండలపై పూసిన ఈ నీలకురింజి పువ్వులతో కేరళలోని ఇడుక్కిల్లోని ఉన్న శలోం కొండలు నీలం రంగు తివాచీ పరిచినట్లుగా ఉన్నాయి.

12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూజీ ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులు కూడా భారీగా వస్తుంటారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూసే ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి కర్ణాటకతో పాటు కేరళ,తమిళనాడులకు కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో వ‌స్తుంటారు.12ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ నీలకురింజిలను జీవితంలో ఒక్కసారి అయినా చూసి తీరాల్సిందే.ఈ మొక్క‌లు ప‌న్నెండేండ్లు పెరిగి పూలు పూసిన త‌ర్వాత చ‌నిపోతాయ‌ట‌. అలా వాటి విత్త‌నాల‌తో మొల‌కెత్తే కొత్త మొక్క‌లు పూత‌కు రావ‌డానికి మ‌ళ్లీ 12 ఏండ్లు ప‌డుతుంద‌ట‌. అంటే ఈ పూలు మ‌న‌కు ప్ర‌తి ఏడాది జూలై-అక్టోబ‌ర్ నెల‌ల మ‌ధ్య‌లో క‌నిపిస్తాయి. కానీ, ఒక మొక్క మాత్రం ప‌న్నెండేండ్ల‌కు ఒక్క‌సారే పూస్తుంద‌న్న‌మాట‌.

Neelakurinji Flowers attracting tourists
Neelakurinji Flowers

ఇక నీలం రంగులో ఉండ‌టం వ‌ల్ల ఈ పూల‌కు నీల‌కురింజి పుష్పాలు అనే పేరు వ‌చ్చింద‌ట‌. మ‌ల‌యాళంలో నీల అంటే నీలిరంగు అని, కురింజి అంటే పువ్వు అని అర్థ‌మ‌ట‌. ఇవి కొండ ప్రాంతాల‌లో 1300-2400 మీట‌ర్ల ఎత్తులో పెరుగుతుంటాయి. మొక్క 30-60 సెంటిమీట‌ర్ల ఎత్తు ఉంటుంది. ఊదా నీలం రంగులో ఉండే ఈ పూల కార‌ణంగానే నీల‌గిరి ప‌ర్వ‌త శ్రేణుల‌కి ఆ పేరు వ‌చ్చింది.డబ్బు ఉండాలే గానీ ఈ పూలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాప్టర్ టాక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. హెలీ-టాక్సీ సంస్థ తంబీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌ర్యాట‌కుల‌కి ఈ పూలు చూసేందుకు గాను బంప‌ర్ ఆఫర్ ఇస్తోంది.

Sam

Recent Posts