హెల్త్ టిప్స్

మీ క‌ళ్లు త‌ర‌చూ పొడి బారుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది నిత్యం టీవీల‌కి అతుక్కుపోవ‌డం లేదంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌తో ఎక్కువ స‌మయం గ‌డ‌ప‌డం వంటివి చేస్తున్నారు. దీని వ‌ల‌న కొంద‌రి క‌ళ్లు పొడిబార‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కళ్లు తరచూ పొడిబారుతున్న‌ట్టైతే, మీ కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోతున్న‌ట్టే అని అనుకోవాలి. కన్నీళ్లు కళ్లను శుభ్రపరచడంతో పాటు, వాటిని తేమగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లలో కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయే పరిస్థితిలో కళ్లు పొడిబారతాయి. కళ్లు పొడిబారినపుడు కళ్లలో మంట, కంటిలో అసౌకర్యం ఉంటుంది. కళ్లు పొడిబారడం వలన కంటి సమస్యలు సంభవించవచ్చు, ఇవన్నీ స్థూలంగా కంటిచూపును ప్రభావితం చేస్తాయి.

కళ్లు రెప్ప వేయడం వలన వాటిని తేమగా ఉంచవచ్చు. కాని చాలా మంది రెప్పవేయకుండా ఉండటం, తదేకంగా ఒకే దానిని చూస్తూ ఉండటం, తగినంత నిద్రలేకపోవడం వలన కళ్లు పొడిబారతాయి. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూసే వారిలో, ఎక్కువ కాలం పాటు కంప్యూటర్‌ల ముందు పని చేసే వాళ్లలో కన్నీళ్లు తగ్గుతాయి. ఇలాంటి వారిలోనే కళ్లు పొడిబారిన సమస్యలు ఎక్కువ తలెత్తుతున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా చాలా మంది పొడి కళ్లు, ఇతర కంటి జబ్బుల లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. కంటి సంర‌క్ష‌ణ కోసం ఎక్కువ సేపు స్క్రీన్‌ని చూడకుండా ఉండాలి. తరచుగా విరామం తీసుకోండి, 20-20-20 నియమం పాటించండి. ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకోవాలి, 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడాలి.

if you are facing dry eyes problem then follow these tips

కొన్ని ర‌కాల మెడిస‌న్స్ మానేయ‌డం, స‌న్‌గ్లాసెస్ పెట్టుకోవ‌డం వ‌ల‌న ప్ర‌యోజ‌నం ఉంటుంది.దుమ్ము, ధూళి, పొగ‌, ఎండ‌, వెలుతురు విప‌రీతంగా ఉండే వాతావ‌ర‌ణానికి కూడా దూరంగా ఉండాలి. కంటి నిండా నిద్ర‌, స్క్రీన్ టైమ్ త‌గ్గించుకుంటే మీరు కంటి స‌మ‌స్య‌ల‌ని నుండి కాస్త దూరంగా ఉంటారు. కంటి ఒత్తిడికి దోహదపడే ఏవైనా దృష్టి సమస్యలను గుర్తించి సరిచేయడంలో రెగ్యులర్ కంటి పరీక్షలు సహాయపడతాయి. కంటి వైద్యుడు మీ పరిస్థితులకు తగిన కళ్లజోడు లేదా ఏవైనా చికిత్సలను సిఫారసు చేయవచ్చు. మీ కళ్లకు తేమను అందించడానికి, అవి ఎండిపోకుండా నిరోధించడానికి త‌ర‌చు రెప్ప‌లు వేస్తూ ఉంటే మంచిది.

Share
Sam

Recent Posts