వినోదం

Viral Pic : క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అనే విష‌యం మీకు తెలుసా..?

Viral Pic : సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల హీరో, హీరోయిన్స్‌కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఫొటోల‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ చిన్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చి అంద‌రి మ‌నసులు దోచుకుంది. చిన్న‌ప్పుడే హీరోయిన్ లా ఫీల‌య్యి ఇలా ఫోటోల‌కు పోజులిచ్చింద‌ని కొంద‌రు ఈ అమ్మ‌డి ఫొటోకి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన నివేదా క్యూట్ పిక్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుది.

నివేదా పేతురాజ్‌కి టాలెంట్ అన్నీ ఉన్నా కూడా లక్ మాత్రం సహకరించదు. అందుకే చేసిన సినిమాలు దాదాపు హిట్ అయినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. ముందుగా ఈ అమ్మ‌డు తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది . ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది. ఆ తర్వాత కూడా పలు యూత్‌ఫుల్ సినిమాలతో పలకరించింది. అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది నివేదా.

nivetha pethuraj child hood photo viral

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా తను హీరోయిన్ అనిపించుకోవడంకంటే నటి అనిపించుకోవడమే సంతోషమని స్పష్టం చేసింది. చాలామంది హీరోయిన్‌గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదని చాలా భయపడుతూ ఉంటారు, తనకు అలాంటి భయాలు ఏమీ లేవని చెప్పింది నివేదా. తనకు నటన పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదని, నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఒక‌వేళ తనకు అవకాశాలు రానప్పుడు ఉద్యోగం అయినా చేసుకుంటానని, తనకు ఆ సత్తా ఉందని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Admin

Recent Posts