Noodles Idli : ఇడియప్పం.. కేరళ వంటకమైన ఇడియప్పం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఇడియప్పంను అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేరకం అల్సాహారాలె కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయవచ్చు. తేలికగా చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ ఇడియప్పంను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడియప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటింపావు కప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టీ స్పూన్, బియ్యంపిండి – ఒక కప్పు.
ఇడియప్పం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లకు అలాగే జంతికల గొట్టానికి నూనె రాసుకోవాలి. సన్న రంధ్రాలు ఉన్న బిళ్లను జంతికల గొట్టంలో ఉంచి నూనె రాసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. తరువాత బియ్యంపిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిని జంతికల గొట్టంలో ఉంచి ఇడ్లీ ప్లేట్ లలో చిన్న చిన్న జంతికలుగా వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత ఇడ్లీ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి. వీటిని మధ్యస్థ మంటపై 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడియప్పం తయారవుతుంది. దీనిని చట్నీలతో పాటు వెజ్, నాన్ వెజ్ కూరలతో కూడా తినవచ్చు. నూడుల్స్ ఇష్టపడే పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.