Honey : రాత్రి నిద్ర‌కు ముందు తేనె తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Honey : మ‌న‌కు ప్ర‌కృతి ద్వారా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌దార్థాల్లో తేనె కూడా ఒక‌టి. తేనె రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. పంచ‌దార‌కు బ‌దులుగా మ‌నం తేనెను ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే తేనెను ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉంటాము. తేనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వివిధ రూపాల్లో మ‌నం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మం ప‌గ‌టి పూట తేనెను ఎక్కువ‌గా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ రాత్రి ప‌డుకోబోయే ముందు ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పూట తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. తేనెలో ఉండే పాలీఫినాల్స్ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే రాత్రి పూట తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డ‌లిక త‌గ్గి నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది అర్థ‌రాత్రి మెలుకువ వ‌స్తూ ఉంటుంది. అలాంటి వారు రాత్రి ప‌డుకునే ముందుగా తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌గ్గుతుంది. అధిక రక్త‌పోటు స‌మ‌స్య గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తుంది. చాలా మంది నిద్ర‌లో హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉంటాము.

amazing health benefits of honey taking before sleep
Honey

ఇటువంటిస్థితి మ‌న‌కు రాకుండా ఉండాలంటే రాత్రి ప‌డుకునే ముందు తేనెను తీసుకోవాలి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త‌పోటును అదుపులో ఉంచడంలో స‌హాయ‌డ‌ప‌డ‌తాయి. అలాగే ప‌డుకునే ముందు తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు త‌గ్గుతాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. కొంద‌రికి రాత్రి ప‌డుకున్న త‌రువాత విప‌రీత‌మైన ద‌గ్గు వ‌స్తుంది. అలాంటి వారు ప‌డుకునే ముందు తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. తేనెలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి.

ఇవి ద‌గ్గును, గొంతునొప్పిని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇక చ‌ర్మం య‌వ్వ‌నంగా ఉండాల‌నుకునే వారు రాత్రి ప‌డుకునే ముందు తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. మీరు కూడా ఇటువంటి అద్భుత‌మైన ప్ర‌యోజనాల‌ను పొందాలంటే రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక టీ స్పూన్ తేనెను తినాల‌ని లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts