technology

ఇలా చేస్తే మీకు గూగుల్‌పేలో ఈజీగా రూ.1000 వ‌స్తాయి..!

ప్ర‌స్తుతం డిజిట‌ల్ పేమెంట్ల సంఖ్య పెరిగింది. ఒక‌ప్పుడు న‌గ‌దు లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రిగేవి. కానీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌పంచ‌మే మారిపోయింది. అర‌చేతిలో ఫోన్‌లో న‌గ‌దును ప్ర‌పంచంలోని ఎవ‌రికైనా కొన్ని సెక‌న్ల‌లో పంపే వెసులు బాటు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో యూపీఐ ద్వారా చెల్లింపులు ఎక్కువైపోయాయి. ఇక యూపీఐ విష‌యానికి వ‌స్తే ప్ర‌ధానంగా గూగుల్ పేను చాలా మంది వాడుతుంటారు. అయితే ఒక‌ప్పుడు తేజ్‌గా ఉన్న ఈ యాప్ గూగుల్ పే గా మారింది.

అప్ప‌ట్లో గూగుల్ పేలో న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు స్క్రాచ్ కార్డుల‌ను ఇస్తున్నారు. అయితే గూగుల్ పేలో ఇప్పుడు మ‌ళ్లీ న‌గ‌దును గెలుచుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. రూ.51 నుంచి రూ.1001 వ‌ర‌కు న‌గ‌దును మీరు గూగుల్ పేలో గెలుచుకోవ‌చ్చు. ఈ క్యాంపెయిన్‌ను న‌వంబ‌ర్ 7 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ పే వినియోగ‌దారులు 6 ల‌డ్డూల‌ను గెలుచుకోవాలి. దీంతో వారికి రూ.51 నుంచి రూ.1001 మ‌ధ్య‌లో ఎంతైనా క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

now you can win up to rs 1000 in google pay

ఇక ల‌డ్డూల‌ను పొందాలంటే వినియోగ‌దారులు గూగుల్ పేలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను భిన్న ర‌కాలుగా ల‌డ్డూల‌ను పొంద‌వ‌చ్చు. ఎవ‌రైనా మ‌ర్చంట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క‌నీసం రూ.100 చెల్లింపు చేస్తే ల‌డ్డూల‌ను గెలుచుకోవ‌చ్చు. అలాగే మొబైల్ రీచార్జి లేదా పోస్ట్‌పెయిండ్ నంబ‌ర్ బిల్ పే అయితే క‌నీసం రూ.100 చెల్లిస్తే ల‌డ్డూలు వ‌స్తాయి. అలాగే బిల్ పేమెంట్స్ అయితే రూ.100, గిఫ్ట్ కార్డుల‌ను కొంటే క‌నీసం రూ.200 చెల్లించాలి. ఈ విధ‌మైన ట్రాన్సాక్ష‌న్స్ చేస్తే వ‌చ్చే లడ్డూల‌కు గాను పైన చెప్పిన‌ట్లుగా రూ.51 నుంచి రూ.1001 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ చెల్లిస్తారు. అయితే ఇది ఏ మేర స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Admin

Recent Posts