ఆధ్యాత్మికం

తులసి మొక్కకు ఏ రోజు నీళ్లు పోయకూడదో తెలుసా ?

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం తులసి మొక్కను ఒక దైవ మొక్కగా భావిస్తాము. ఈ క్రమంలోనే తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం నీటిని పోసి ఉదయం సాయంత్రం పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.అయితే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తులసి మొక్కకు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోయకూడదు. ముఖ్యంగా కొన్ని రోజులలో తులసి మొక్కను తాకకూడదని పండితులు చెబుతున్నారు. మరి తులసికి ఏ రోజు నీళ్లు పోయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

తులసి మొక్కకు ఆదివారం, ఏకాదశి, చంద్రగ్రహణం రోజునీటిని అసలు పోయకూడదు. అదే విధంగా ఈ మూడు రోజులు తులసి చెట్టును తాకకూడదు, తులసి దళాలను కోయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి పనులు పొరపాటున చేసినా కూడా వారికి సమస్యలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

on which day you should not water tulsi plant

ఈ క్రమంలోనే మనకు శుభం కలగాలంటే ప్రతి శుక్రవారం తులసి చెట్టుకు పచ్చిపాలు పోసి నేతి దీపం వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. అదేవిధంగా ఎండిపోయిన తులసి ఆకులను పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ తులసి పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts