Onion Coconut Chutney : ఉల్లిపాయ‌లు, కొబ్బ‌రితో చ‌ట్నీ.. ఇడ్లీలు, దోశ‌ల్లోకి అదిరిపోతుంది..!

Onion Coconut Chutney : మ‌నం అల్పాహారాల‌లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మనం చేసే అల్పాహారాల‌ను సుల‌భంగా తిన‌గ‌లుగుతాము. అయితే ఒకే ర‌కం చ‌ట్నీలు తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచిక‌ర‌మైన వెరైటీ చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల్లిపాయ‌, ప‌చ్చి కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా అప్ప‌టిక‌ప్పుడు చేసుకునే ఈ ఉల్లి కొబ్బ‌రి చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లి కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె -అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ప‌చ్చిమిర్చి – 2, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Onion Coconut Chutney recipe in telugu very tasty and healthy
Onion Coconut Chutney

ఉల్లి కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డిన త‌రువాత క‌రివేపాకు, జీల‌క‌ర్ర, ప‌చ్చి కొబ్బ‌రి వేసి వేయించాలి. వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని త‌గినంత ఉప్పు వేసుకోవాలి. త‌రువాత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి కొబ్బ‌రి చట్నీ త‌యార‌వుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ ఒకే ర‌కం చ‌ట్నీలు కాకుండా ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts