Palli Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా ప‌ల్లీల చాట్ చేసి తినండి.. రుచి అదుర్స్ అంటారు..!

Palli Chaat : ప‌ల్లీలు.. మ‌నం వంట‌ల్లో వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. ఎక్కువ‌గా చ‌ట్నీలు, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో అలాగే పొడిగా చేసి వంట‌ల్లో కూడా వాడుతూ ఉంటాము. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో ఇలా అనేక రకాలుగా ప‌ల్లీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డతాయి. వంటల్లో వాడ‌డంతో పాటు ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉడికించిన ప‌ల్లీల‌ను నేరుగా తిన‌డానికి బ‌దులుగా వాటిని మ‌రింత రుచిగా చాట్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉడికించిన ప‌ల్లీల‌తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పల్లి చాట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక కప్పు, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 క‌ప్పులు, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాట ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, కారం – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా -అర టీ స్పూన్.

Palli Chaat recipe in telugu eat at evening
Palli Chaat

ప‌ల్లి చాట్ త‌యారీ విధానం..

ముందుగా పల్లీల‌ను నీటిలో వేసి 3 నుండి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ల్లీల‌ను నీరంతా పోయేలా వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి బాగా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి చాట్ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పిల్ల‌లు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts