Spicy Mutton Paya : మ‌ట‌న్ పాయాను కార‌కారంగా ఇలా చేయండి. రోటీల్లోకి టేస్టీగా ఉంటుంది..!

Spicy Mutton Paya : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ పాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఎముక‌ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ పాయ‌ను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే మ‌ట‌న్ పాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, సంగ‌టి ఇలా దేనితో తిన్నా కూడా ఈ పాయ చాలా చ‌క్క‌గా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ ప‌యా కర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చిక్క‌టి గ్రేవితో రుచిగా మ‌ట‌న్ పాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ పాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ పాయ – 2 కాళ్లు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – రెండున్న‌ర గ్లాసులు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Spicy Mutton Paya recipe tasty with roti
Spicy Mutton Paya

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 4, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

మ‌ట‌న్ పాయ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత వాటి నుండి స‌గం ఉల్లిపాయ ముక్క‌ల‌ను గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత పాయ వేసి క‌ల‌పాలి. అంతాక‌లిఏలా క‌లుపుకున్న త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి వేయించాలి. పాయ ఉడుకుతుండ‌గానే మరో క‌ళాయిలో ధ‌నియాలు,జీల‌క‌ర్ర‌, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, ఎండు కొబ్బ‌రి, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌క్క‌కు ఉంచిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి.

త‌రువాత ఈ పేస్ట్ ను వేగుతున్న పాయ‌లో వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పైమ‌రో 5నిమిషాల పాటు వేయించిన త‌రువాతమిరియాల పొడి, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నుండి 15 విజిల్స్ వ‌చ్చే వ‌రకు ఉడికించాలి. కుక్క‌ర్ ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి కొత్తిమీర వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ పాయ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన పాయ‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పాయ‌ను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts