Palli Chutney : ప‌ల్లి చ‌ట్నీని ఇలా చేయండి.. ఇడ్లీ, దోశ‌లోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Palli Chutney : ప‌ల్లీల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌ను మొల‌కెత్తించి , నాన‌బెట్టి తిన‌డంతో పాటు వీటితో మ‌నం రుచిగా ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌ల్లీల‌తో అన్నంలోకి తినేలా రుచిగా, సుల‌భంగా ప‌ల్లీ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 100 గ్రా., ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, నాన‌బెట్టిన‌ చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.

Palli Chutney how to make it recipe
Palli Chutney

ప‌ల్లి చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు స‌గానికి పైగా వేగిన త‌రువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. వీట‌న్నింటిని చ‌క్క‌గా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన ప‌ల్లీలు, ఎండుమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, ఉప్పు, నాన‌బెట్టిన చింత‌పండును నీటితో స‌హా వేసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రాగి సంగ‌టితో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts