Paneer Poratu : ప‌నీర్‌తో ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచిని జ‌న్మ‌లో మ‌రిచిపోరు..!

Paneer Poratu : ప‌నీర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెచండంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప‌నీర్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ పొరట్టు కూడా ఒక‌టి. దీనిని ప‌నీర్ బుర్జీ అని కూడా అంటారు. మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో ఈ వంట‌కం ల‌భిస్తూ ఉంటుంది. ఈ ప‌నీర్ పొర‌ట్టును మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవచ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ ప‌నీర్ పొర‌ట్టును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ పొర‌ట్టు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ – ఒక క‌ప్పు, కారం – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ట‌మాట – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 3 టీ స్పూన్స్.

Paneer Poratu recipe in telugu make in this way
Paneer Poratu

ప‌నీర్ పొర‌ట్టు త‌యారీ విధానం..

ముందుగా ప‌నీర్ ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి లేదా చేత్తో న‌లిపి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌తూ పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బడిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియ‌ల పొడి వేసి క‌లపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత చిన్న‌గా చేసుకున్న ప‌నీర్ ను వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, త‌రిగిన కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ పొర‌ట్టు త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ప‌నీర్ తో పొర‌ట్టును త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts