Turmeric And Cinnamon : ప‌సుపు, దాల్చిన చెక్క పొడి క‌లిపి ఇలా త‌యారు చేసి తీసుకోండి.. కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గిపోతారు..!

Turmeric And Cinnamon : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి వాడే ప్ర‌తి ప‌దార్థం కూడా మ‌న వంట‌గ‌దిలో ఉండేదే. అలాగే ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా తొల‌గిపోతుంది. మ‌నం చాలా వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువును త‌గ్గించే ఈ టీ ని ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టీని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ దంచిన అల్లాన్ని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, అర టీ స్పూన్ ప‌సుపును, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, రెండు క‌ప్పుల నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని పోయాలి. త‌రువాత పైన‌చెప్పిన మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ నీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ టీని వ‌డ‌క‌ట్టి క‌ప్పులో పోసుకోవాలి. త‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న టీని రోజూ రెండు పూట‌లా తాగ‌డం వ‌ల్ల మనం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Turmeric And Cinnamon this is how it works for weight loss
Turmeric And Cinnamon

ఈ టీ ని తాగుతూనే రోజూ వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను, తీపి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. పండ్లు, తాజా కూర‌గాయ‌ల‌ను, ఆకు కూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే ఈ టీని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ టీ తయారీలో ఉప‌యోగించిన ప్ర‌తి ప‌దార్థంలో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోద‌క శ‌క్తి పెరుగుతుంది. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డకుండా ఉంటాము. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ న‌శిస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి టీ ని తయారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts