Paneer Yakhni : ప‌నీర్‌తో ఈ వంట‌కాన్ని చేసి తినండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మ‌రిచిపోరు..!

Paneer Yakhni : ప‌నీర్‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటాం. ప‌నీర్ బ‌ట‌ర్ మసాలా, పాల‌క్ ప‌నీర్‌, ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా.. ఇలా అనేక ర‌కాల కూర‌ల‌ను చేస్తుంటాం. పనీర్‌తో మ‌నం రైస్ వంట‌కాల‌ను కూడా చేయ‌వ‌చ్చు. వీటితో తందూరి వంట‌ల‌ను కూడా వండ‌వ‌చ్చు. ప‌నీర్‌ను ఏ ర‌కంగా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహారాల్లో ప‌నీర్ చాలా ముఖ్య‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా చాలా మంది ప‌నీర్‌తో పైన చెప్పిన విధంగా ప‌లు ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని ఆర‌గిస్తుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌నీర్ వంట‌కం మాత్రం చాలా వెరైటీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఇక దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్‌తో మనం ప‌నీర్ య‌ఖ్ని అనే వంట‌కాన్ని చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేసేందుకు గాను ముందుగా ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు గింజ‌లు, న‌ల్ల మిరియాలు, ఎండు మిర్చి, న‌ల్ల యాల‌కులు, ఆకుప‌చ్చ యాల‌కులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాల‌ను తీసుకుని పెనంపై వేసి డ్రై రోస్ట్ చేయాలి. అనంత‌రం వాటిని మిక్సీలో మెత్త‌ని పొడిగా ప‌ట్టుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ తీసుకుని అందులో జీడిప‌ప్పు, పనీర్ ముక్క‌లు, గ‌స‌గ‌సాలు, త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులోనే కొన్ని ప‌నీర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. త‌రువాత త‌రిగిన క్యాప్సికం వేయాలి. అవి కాస్త మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఆ ప‌దార్థాల‌ను తీసి ప‌క్క‌న పెట్టాలి.

Paneer Yakhni recipe in telugu how to make it
Paneer Yakhni

కొత్తిమీర‌తో గార్నిష్ చేయాలి..

అదే పాన్‌లో మ‌ళ్లీ నూనె వేసి వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకులు, త‌రిగిన అల్లం, ప‌చ్చి మిర్చి వేసి వేయించాలి. త‌రువాత ముందుగా ప‌ట్టుకున్న జీడిప‌ప్పు, పనీర్ పేస్ట్‌ను వేసి బాగా క‌లిపి ఉడికించాలి. అందులో కాస్త పెరుగు వేయాలి. అవ‌స‌రం అనుకుంటే కాస్త నీళ్ల‌ను పోయ‌వ‌చ్చు. త‌రువాత అన్నింటినీ బాగా ఉడికించాలి. అనంత‌రం ఉప్పు, చ‌క్కెర‌, కుంకుమ పువ్వు నీళ్లు వేసి బాగా క‌లిపి ఉడికించాలి. ఆ త‌రువాత ముందుగా వేయించి పెట్టుకున్న ప‌నీర్ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం గ‌రం మ‌సాలా పొడి వేయాలి. బాగా ఉడికించాలి. చివ‌ర‌గా త‌రిగిన కొత్తిమీర ఆకుల‌ను వేసి గార్నిష్ చేయాలి. దీంతో వేడి వేడిగా ఉండే ప‌నీర్ య‌ఖ్ని రెడీ అవుతుంది.

ఇలా త‌యారు చేసిన ప‌నీర్ య‌ఖ్నిని రోటీ, పులావ్‌, అన్నంతో తిన‌వ‌చ్చు. కానీ బ‌ట‌ర్ నాన్ రోటీల‌తో తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్‌లు వ‌చ్చిన‌ప్పుడు లేదా స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ క‌ర్రీని చేసి రోటీల‌తో లాగించేయ‌వ‌చ్చు. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్క‌సారి ఇలా చేసి పెడితే మ‌ళ్లీ మళ్లీ కావాల‌ని అడుగుతారు.

Share
Editor

Recent Posts