వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా..?

పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా.. ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అతనిపై ఎలాంటి రాజకీయ మచ్చలు లేకపోవడంతో తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ వచ్చారు.

ముఖ్యంగా పవన్ పెళ్ళిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేసారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ పదేపదే పవన్‌ను కించపరుస్తూ వచ్చాయి. ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. పవన్ 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మెుదటిగా వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడువలు రావడం.. చివరకు అది విడాకులకు దారి తీసింది. నందిని.. వవన్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తర్వాత 2008లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నాడు.

pawan kalyan first wife nandini what she is doing now

నందిని విషయానికి వస్తే పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంది. ఇక పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశాడు. వారికి ఇద్దరూ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో కూడా విడిపోయి ర‌ష్యన్ న‌టి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.

Admin

Recent Posts