ఆధ్యాత్మికం

వినాయకుడు కలలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా ?

సాధారణంగా మనం పగలు లేదా రాత్రి పడుకున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. ఈ విధంగా పడుకున్నప్పుడు కొన్ని భయంకరమైన కలలు వస్తే, కొన్ని సార్లు మనకు ఎంతో అనుకూలమైన కలలు వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు పీడకలలు వస్తే అవి నిజంగానే జరుగుతాయేమోనని కంగారుపడుతూ ఉంటాము. ఇలా కలలో మనకి ఎన్నో రకాల జంతువులు, పక్షులు, నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మన కలలో వినాయకుడు కనిపిస్తే దేనికి సంకేతం ? కలలో వినాయకుడు కనిపించడం వల్ల ఏం జరుగుతుంది ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మనం అనుకున్నప్పుడు మన కలలో వినాయకుడు కనబడితే అది శుభానికి సంకేతం. వినాయకుడిని శుభానికి గుర్తుగా పూజిస్తాము. మనం ఏ కార్యం చేసినా అందులో ఎలాంటి ఆటంకం లేకుండా అంతా శుభం కలగాలని మొట్టమొదటగా వినాయకుడికి పూజ చేస్తాము. కనుక అంతటి శుభకరమైన దేవుడు మన కలలో కనిపిస్తే ఇక మనం కోరుకున్న కోరికలు నెరవేరి, మన జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయని అర్థం.

what is the meaning of it when lord ganesha appears in dream

ఇలా వినాయకుడు కలలో కనిపించిన వారికి వారి జీవితం ఎంతో సుఖసంతోషాలతో నిండిపోతుందని, ఈ విధంగా స్వామి వారు కలలో కనబడితే వారు చేస్తున్నటువంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు విజయవంతం అవుతాయని అర్థం. అదేవిధంగా మీరు ఏదైనా శుభకార్యం తలపెడితే ఆ కార్యం చేయడం మర్చిపోతే అలాంటి సమయాల్లో కూడా వినాయకుడు కలలో కనిపిస్తాడని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts