Peanuts Dates Laddu : స్వీట్ షాపుల్లో మనకు అనేక రకాల వెరైటీ లడ్డూలు లభిస్తుంటాయి. కొన్ని బూందీతో చేస్తారు. కొన్నింటిని డ్రై ఫ్రూట్స్‌తో చేస్తుంటారు. అయితే పల్లీలు, ఖర్జూరాలను కలిపి కూడా లడ్డూలను చేయవచ్చు. ఇవి ఎంతో తియ్యగా.. టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పల్లీలు ఖర్జూరా లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు ఖర్జూరా లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఖర్జూరాలు – 1 కప్పు, పల్లీలు – 1 కప్పు, యాలకుల పొడి – అర టీస్పూన్, నెయ్యి – 3 టీస్పూన్లు.
పల్లీలు ఖర్జూరా లడ్డూలను తయారు చేసే విధానం..
పల్లీలను ముందుగా దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొట్టు తీసి బరకగా పొడిగా చేసుకోవాలి. ఖర్జూరాల్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా పట్టుకోవాలి. పల్లీల పొడిలో ఖర్జూరాల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి కావల్సిన సైజులో లడ్డూలలా చేయాలి. ఇందులో పల్లీలకు బదులుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్, కిస్మిస్ వంటి నట్స్‌ను కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఎప్పుడూ చేసే రొటీన్ లడ్డూలకు బదులుగా ఇలా ఒక్కసారి పల్లీలు ఖర్జూరాల లడ్డూలను చేసి తినండి. రుచిని మరిచిపోరు. ఎవరైనా సరే ఇష్టపడతారు.