Prawns 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప్రాన్స్ 65ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Prawns 65 : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల నాన్ వెజ్ ఐటమ్స్ లో ప్రాన్స్ 65 కూడా ఒక‌టి. రొయ్య‌ల‌తో చేసే ఈ వంట‌కం క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ ప్రాన్స్ 65 ని అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా రొయ్య‌ల‌తో ఈ వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ 65 ని ఇంట్లోనే చాలా సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాన్స్ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శుభ్ర‌ప‌రిచిన రొయ్య‌లు – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, బియ్యంపిండి – అర‌టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్.

Prawns 65 recipe in telugu make in this method
Prawns 65

టాసింగ్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక‌టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.

ప్రాన్స్ 65 త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌ను ఉప్పు,ప‌సుపు వేసి శుభ్రంగా క‌డుక్కోని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని చ‌ల్లుకుని పిండి రొయ్య‌ల‌కు పట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ రొయ్య‌ల‌ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ రొయ్య‌ల‌ను వేడి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రొయ్య‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, బిర్యానీ ఆకు,ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత రొయ్య‌లు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ 65 త‌యార‌వుతుంది. దీనిని ఉల్లిపాయ ముక్క‌లు, నిమ్మ‌ర‌సంతో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా రొయ్య‌ల‌తో చేసిన ఈ వంట‌కాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts