vastu

Aloe Vera For Wealth : కలబంద మొక్కను ఇంట్లో ఇలా పెట్టండి.. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది..!

Aloe Vera For Wealth : కలబంద.. దీన్నే ఇంగ్లిష్‌లో అలొవెరా అని కూడా అంటారు. ఇది మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని చర్మం, శిరోజాల సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్‌, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అయితే వాస్తు పరంగా కూడా కలబంద మనకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

కలబంద మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటుంటారు. ఇండోర్‌ ప్లాంట్‌గా కూడా దీన్ని కుండీల్లో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఇక అలంకరణ మొక్కగానే కాక వాస్తు పరంగా కూడా మనకు కలబందతో ఉపయోగాలు ఉంటాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని నెగెటివ్‌ ఎనర్జీ అంతా పోతుంది. పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని వారికి ఉండే సమస్యలు అన్నీ పోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. డబ్బులు దండిగా సంపాదిస్తారు. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది.

put aloe vera plant in your home like this for wealth

ఇక కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంటికి తెచ్చి శుభ్రం చేయాలి. తరువాత దేవుడి దగ్గర ఉంచి పూజలు చేయాలి. అనంతరం పాడ్యమి ఘడియలు మొదలయ్యాక ఆ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడివైపు ఒక దారం సహాయంతో కట్టాలి. అలాగే ఇంట్లో హాల్‌ లో లేదా బెడ్‌ రూమ్‌, బాల్కనీలలోనూ కలబంద మొక్కను కుండీల్లో ఉంచవచ్చు. దీంతో ఇది నెగెటివ్‌ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. దీంతో ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కుతారు. ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలా కలబందను పెట్టుకుంటే ఎంతగానో మేలు చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts