ఆధ్యాత్మికం

Lord Hanuman : హ‌నుమంతుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి..? త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వలన, సమస్యల నుండి గట్టెక్కవచ్చు అని భావిస్తారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ప్రదక్షిణలు ఎన్ని చేస్తే మంచిది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. పైగా ఒక్కొక్క ప్రదక్షణం చేసి, ప్రతి ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి.

ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. హనుమంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడు, ఐదు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే మంచిది. సకల రోగ, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తే, సంతానాన్ని కూడా పొందవచ్చు. అలా సంతానాన్ని పొందిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ”ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రాబాంశాంతం రామదూతం నమామ్యహం” హనుమంతునికి ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఇలా ఈ శ్లోకం చెప్పుకోవడం చాలా మంచిది.

how many pradakshinas we should do to lord hanuman

”శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రాబాంశాంతం రామదూతం నమామ్యహం. మర్కటేష మహోత్సవ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మామ్ రక్ష. శ్రీయం దాపయ మే ప్రభో” అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. మంగళవారం నాడు, హనుమంతునికి శరీరం మీద సింధూరం పూయడం అంటే చాలా ఇష్టం.

సిందూరం తో పూజ చేసి, అరటి పండ్లు ఆంజనేయస్వామికి మంగళవారం నాడు నైవేద్యంగా పెడితే, ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. హనుమంతుడు శనివారం పుట్టారు కాబట్టి ఆయనకి శనివారం చాలా ఇష్టం. ఆరోజు అప్పాలు, వడమాల తో ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

Admin

Recent Posts