ఆధ్యాత్మికం

Shami Tree For Money : శ‌నివారం నాడు ఈ చెట్టును ఎవ‌రికైనా దానం చేయండి.. మీపై క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..!

Shami Tree For Money : హిందు ధ‌ర్మంలో కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను, చెట్ల‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. ఈ మొక్క‌ల‌ను చెట్ల‌ను కూడా చాలా ప‌విత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ మొక్క‌ల‌ను, చెట్ల‌ను పూజించ‌డం వ‌ల్ల దేవ‌త‌ల అనుగ్ర‌హం కూడా మ‌న‌కు ల‌భిస్తుంది. దోషాలు కూడా తొల‌గిపోతాయి. హిందువులు ప‌విత్రంగా పూజించే మొక్క‌ల‌ల్లో జ‌మ్మిచెట్టు కూడా ఒక‌టి. జ‌మ్మిచెట్టుకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ద‌స‌రా నాడు ఈ మొక్క‌ను ప్ర‌త్యేకంగా పూజిస్తారు. శ‌నిదోషాన్ని తొల‌గించే చెట్టు జ‌మ్మిచెట్టు అని చెప్ప‌వ‌చ్చు. అలాగే జ‌మ్మి చెట్టు గురించి రామాయ‌ణంలో కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌బ‌డింది. పురాణాల్లో జ‌మ్మిచెట్టుకు ఉన్న ప్రాధాన్య‌త‌ను అలాగే ఈ చెట్టును పూజించ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే శుభ ఫ‌లితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రావ‌ణుడితో యుద్దం చేసే ముందు రాముడు జ‌మ్మి చెట్టును పూజించాడ‌ని దీంతో యుద్దంలో శ్రీరాముడు విజ‌యం సాధించాడ‌ని న‌మ్ముతారు. అలాగే శివుని పూజ‌లో కూడా జ‌మ్మి ఆకుల‌ను ఉప‌యోగిస్తారు. అదేవిధంగా శ‌నివారం నాడు జ‌మ్మి మొక్క‌ను దానం చేయ‌డం వ‌ల్ల శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని న‌మ్ముతారు. శ‌నివారం నాడు ఈ మొక్క‌ను దానం చేయ‌డం వ‌ల్ల సంతోషం, ఐశ్వ‌ర్యం క‌లుగుతుంది. చాలా మంది ఈ మొక్క‌ను దానం చేయ‌డం శుభ‌ప్ర‌దంగా కూడా భావిస్తారు. జ‌మ్మిచెట్టు దానం బంగారం దానం చేయ‌డంతో స‌మాన‌మ‌ని గ్రంథాల‌ల్లో కూడా ఉంది. జ‌మ్మిమొక్క‌ను దానం చేసిన వారికి శ‌నిదేవుని అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని కూడా న‌మ్ముతారు. అలాగే ఈ మొక్క‌ను దానం చేయ‌డం వ‌ల్ల జీవితంలో కొన‌సాగుతున్న అడ్డంకులు తొల‌గిపోతాయి.

donate this plant on saturday to attract wealth

జ‌మ్మి మొక్క‌ను దానం చేయ‌డం వ‌ల్ల శ‌నిగ్ర‌హం యొక్క ఏనాళ్ల శ‌ని నుండి కూడా త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ విధమైన ప‌రిహారాలు చేయ‌డం వ‌ల్ల శ‌ని దేవుని కృప‌తో పాటు మనం ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జ‌మ్మి చెట్టును దానం చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి ప్ర‌స‌న్నురాలై సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హిస్తుంద‌ని న‌మ్ముతారు. అంతేకాకుండా జ‌మ్మి మొక్క‌ను దానం చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భించి జీవితంలో ఉండే ఆర్థిక సంక్షోభాల నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇంట్లో ఆనంద వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఈ విధంగా జ‌మ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని ఈ మొక్క‌ను పూజించ‌డం వల్ల అలాగే దానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో శుభ ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts