vastu

గోడ గ‌డియారం వాస్తు ప్ర‌కారం ఏ దిశ‌లో ఉండాలి.. అక్క‌డ పెట్టారంటే అంతే..!

గుడిసె నుండి బంగ్లా వ‌ర‌కు ప్ర‌తి ఇంట్లో కూడా గోడ గ‌డియారం కామన్. ఎక్కడ గోడకి మేకు ఉంటే అక్కడ తగిలించేస్తారు. మరికొందరు తమకు అనువుగా ఉండే ప్రదేశంలో చూడగానే కంటికి టైమ్ క‌నిపించాల‌ని వెంట‌నే మేకు కొట్టి అక్క‌డ త‌గిలించేస్తారు. కానీ నిజానికి గోడ గడియారం ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. దాన్ని వాస్తు ప్రకారం తగిలించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు సరైన దిశ గురించి తెలుసుకొని పెట్ట‌డం చాలా మంచిది. తప్పుడు దిశలు శ్రేయస్సు, పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఇంట్లో గడియారాన్ని తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని క‌లిగిస్తుంది.దక్షిణ దిశ గోడకి గడియారం ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇది జీవితంలో ప్రతికూలతని పెంచుతుంది.

పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు.ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే… ఆ వాల్ క్లాక్ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. అలా జరిగిందంటే… ఇక ఆ ఇంట్లో మనస్శాంతి ఉండదు. అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు. కొంత మంది పాత వాచీలు, పాత క్లాక్ లను కూడా ఇంట్లో పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిన, విరిగిన, పగిలిన, పాడైన, చిరిగిన, దెబ్బతిన్న వాచీలు, వాల్ క్లాక్‌లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీ లైఫ్ లో సంతోషం ఆగిపోతుందని చెబుతారు.గడియారంలో టైమ్ కరెక్ట్ గా ఉండాలి. వాస్తవ సమయం కంటే తక్కువ సమయం ఉన్న పెట్టకూడదు. అయితే కొన్ని నిమిషాలు ముందు పెట్టుకోవచ్చు. ఆఫీసుకి, స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇలాగే చేస్తారు.

put wall clock in this direction according to vastu

గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఉత్తరం దిశ కుబేరుడు, వినాయకుడి దిశగా పరిగణిస్తారు అందుకే ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం ఎంతో శుభప్రదం. తూర్పువైపు చెక్క గడియారం వేలాడదీస్తే ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది.దక్షిణం దిక్కు స్థిరత్వానికి మార్లం. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతి క్ర‌మేపి నెమ్మ‌దిస్తుంది. అదే సమయంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు. వ్యర్థాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఎన్నో సమస్యలతో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశకు యముడు అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో నారింజ, ఆకుపచ్చ రంగుల గడియారాలను అమర్చకూడదు. ఈ రంగుల గడియారాలు ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది.

Sam

Recent Posts