Radhe Shyam : హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రాధే శ్యామ్ రూ.4 కోట్లు వ‌సూలు..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన రాధే శ్యామ్ కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల చేత వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు. అయితే మొద‌ట్నుంచీ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో క‌థ పూర్తి భిన్నంగా ఉండ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకోవ‌డంతో.. ఈ సినిమాకు భారీగా హైప్ పెరిగింది. దీంతో ఆ హైప్ వ‌ల్లే సినిమా విడుద‌ల‌కు ముందే భారీగా బిజినెస్ చేసింది. అలాగే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే సినిమాకు భారీగా క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి.

Radhe Shyam takes rs 4 crores collections only from Hyderabad with bookings
Radhe Shyam

హైదరాబాద్‌లో రాధేశ్యామ్ సినిమాకు ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించ‌గా.. కేవ‌లం ఈ ఏరియా నుంచే ఈ బుకింగ్స్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఏకంగా రూ.4.73 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఈ క్ర‌మంలోనే రాధే శ్యామ్ మేనియా ఎలా ఉందో ఈ క‌లెక్ష‌న్స్ చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌భాస్ ఈ సినిమాలో పూర్తి భిన్న‌మైన పాత్ర‌ను పోషించాడు. జాత‌కాలు చెప్పే హ‌స్త సాముద్రికుడి పాత్ర‌ను పోషించాడు. ఇక దీనికి, సినిమాలోని ఆయ‌న ప్రేమ క‌థ‌కు సంబంధం ఉంటుంది. అదేమిటి ? అనేది చిత్రంలో చూపించ‌నున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా క‌చ్చితంగా హిట్ టాక్‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక రాధే శ్యామ్ సినిమాకు గాను విడుద‌ల రోజే నైజాం ఏరియాలో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తే చాలా మందిని సినిమాకు ర‌ప్పిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ విశేషాలు తెలియాలంటే ఇంకో 24 గంట‌లు ఆగాల్సిందే.

Editor

Recent Posts