Rakul Preet Singh : సినిమా ప్ర‌మోష‌న్స్‌తో ర‌కుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీ..!

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో చాలా బిజీగా మారింది. ఈ అమ్ముడు తెలుగు సినిమాల్లో పెద్ద‌గా న‌టించ‌డం లేదు. కానీ వ‌రుస బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ జోరు మీద ఉంది. ఇక ఆమె న‌టిస్తున్న బాలీవుడ్ మూవీలు త్వ‌ర‌లో వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. దీంతో స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా ఈమె గ్లామ‌ర్ దుస్తుల‌ను ధ‌రించి త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా తాను న‌టించిన అటాక్ అనే మూవీ ప్ర‌మోషన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ హొయ‌లు ఒలికించింది.

Rakul Preet Singh busy with movie promotions
Rakul Preet Singh

జాన్ అబ్ర‌హాం, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ల‌తో క‌లిసి ర‌కుల్ ప్రీత్ న‌టించిన అటాక్ అనే మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమా చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను ప్ర‌స్తుతం వేగంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌కుల్ ప్రీత్ ధ‌రించిన దుస్తులు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఇక ఇదే కాకుండా ఆమె ర‌న్‌వే 34 అనే మూవీ ప్ర‌మోషన్స్‌లోనూ బిజీగా ఉంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్ ప‌క్క‌న ఆమె న‌టించింది. అలాగే ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి డాక్ట‌ర్ జి అనే మూవీలో, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి థాంక్ గాడ్ అనే సినిమాలో ర‌కుల్ ప్రీత్ న‌టిస్తోంది. వీటితోపాటు అయ‌లాన్‌, ఇండియ‌న్ 2 అనే త‌మిళ సినిమాల్లోనూ ఈమె న‌టిస్తూ ఎంతో బిజీగా ఉంది.

Editor

Recent Posts