Rasam Powder : ర‌సం ఎప్పుడంటే అంటే అప్పుడు కావాలంటే.. ర‌సం పొడిని ఇలా త‌యారు చేసుకోండి..!

Rasam Powder : మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌సం చాలా రుచిగా ఉంటుందని మ‌నంద‌రికీ తెలుసు. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడి అన్నంలో ర‌సం పోసుకుని క‌లిపి తినడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల‌ నుండి కొద్దిగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించిన‌ప్పుడు మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ర‌సం. ర‌సాన్ని అన్నంతోపాటు ఇడ్లీల‌ను తిన‌డానికి కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌సాన్ని తయారు చేయ‌డానికి బ‌య‌ట దొరికే ర‌సం పొడిని వాడే ప‌నిలేకుండా మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా ర‌సం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Rasam Powder make in this way very good taste
Rasam Powder

ర‌సం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, శ‌న‌గ ప‌ప్పు – అర కప్పు, మిరియాలు – పావు క‌ప్పు, ధ‌నియాలు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – పావు క‌ప్పు, ఎండు మిర్చి – 15 నుండి 20, క‌రివేపాకు – పావు క‌ప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఇంగువ – 1 టీ స్పూన్, బియ్యం – 4 టేబుల్ స్పూన్స్.

ర‌సం పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో కందిప‌ప్పును వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై రంగు మారే వ‌ర‌కు క‌లుపుతూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో శ‌న‌గ‌ప‌ప్పును వేసి అదే విధంగా వేయించి పక్క‌న‌ పెట్టుకోవాలి. అదే విధంగా ధ‌నియాల‌ను, జీల‌కర్ర‌ను, మిరియాల‌ను, మెంతుల‌ను, ఎండు మిర్చిని, క‌రివేపాకును, బియ్యాన్ని వేరు వేరుగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న ప‌దార్థాల‌న్నీ చ‌ల్ల‌గా అయిన త‌రువాత జార్ లో వేసి.. ఇందులోనే ఇంగువ‌ను కూడా వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఘుమఘుమ‌లాడే ర‌సం పొడి త‌యార‌వుతుంది. దీనిని మూత ఉండే గాజు సీసాలోనిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఈ పొడిని మిక్సీ ప‌ట్టేట‌ప్పుడు, నిల్వ చేసేట‌ప్పుడు త‌డి లేకుండా చూసుకోవాలి. ఇలా త‌యారు చేసి పెట్టుకున్న ర‌సం పొడితో మ‌న‌కు కావ‌ల్సిన‌ప్పుడ‌ల్లా ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts