Ravva Aloo Puri : ఎప్పుడూ చేసే పూరీల‌ను కాకుండా ఇలా కొత్త‌గా పూరీల‌ను చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Ravva Aloo Puri : ర‌వ్వ ఆలూ పూరీ.. రవ్వ‌, బంగాళాదుంప‌తో చేసే ఈ పూరీలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఒక్క‌సారి రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. గోధుమ‌పిండి, మైదాపిండి, పూరీ పిండితో చేసే పూరీల కంటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో చేసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ర‌వ్వ ఆలూ పూరీల‌ను త‌యారు చ‌య‌డం చాలా సుల‌భం. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో మ‌రింత రుచిగా, క్రిస్పీగా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ ఆలూ పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉప్మా ర‌వ్వ – అర క‌ప్పు, వేడి నీళ్లు – ముప్పావు కప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – 1, గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Ravva Aloo Puri very tasty breakfast to make
Ravva Aloo Puri

ర‌వ్వ ఆలూ పూరీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉప్పు, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, కొత్తిమీర‌,చిల్లీ ప్లేక్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకుని క‌ల‌పాలి. త‌రువాత గోధుమ‌పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ క‌లుపుకోవాలి. పూరీ పిండిలా క‌లుపుకున్న త‌రువాత నూనె వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి లేదా నూనె వేసి పూరీలాగా వ‌త్తుకోవాలి. పూరీని వ‌త్తుకున్న త‌రువాత వీటిని వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. పూరీని నూనెలో వేసిన వెంట‌నే గంటెతో లోప‌లికి వ‌త్తుకోవాలి. పూరీ పొంగిన త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ ఆలూ పూరీ త‌యార‌వుతుంది. దీనిని చ‌ట్నీతో, మసాలా కూర‌ల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం పూరీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts