Cracked Lips : పెద‌వులు బాగా ప‌గిలి అంద విహీనంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Cracked Lips : ప‌గిలిన పెద‌వుల‌తో చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. చ‌ల్ల‌టి గాలులు, పెద‌వులు పొడిబార‌డం, శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌డం, విటమిన్ లోపం, త‌రుచూ పెద‌వుల‌ను నాలుక‌తో త‌డ‌ప‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల పెద‌వులు ప‌గులుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి లిప్ బామ్ ల‌ను, లిప్ కేర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా పెద‌వులు ప‌గ‌ల‌డం త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల పెద‌వులు పొడిబార‌డం త‌గ్గి మృదువుగా, తేమ‌గా, అందంగా త‌యార‌వుతాయి. పెద‌వుల ప‌గుళ్ల‌ను త‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప‌గిలిన పెద‌వుల‌తో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద గుజ్జును వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పెద‌వుల‌పై క‌ల‌బంద గుజ్జును రాసి అర‌గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత నీటితో శుభ్రం చేయాలి.

ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల పెద‌వులు తేమ‌గా ఉండ‌డంతో పాటు ప‌గుళ్లు కూడా త‌గ్గుతాయి. అలాగే పెద‌వుల‌కు వెన్న రాసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వెన్న‌లో పంచ‌దార వేసి పెద‌వుల‌పై నెమ్మ‌దిగా రాస్తూ మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల పెద‌వుల‌పై ఉండే మృత‌క‌ణాలు, పొర‌లు తొల‌గిపోవ‌డంతో పాటు పెద‌వులు మృదువుగా త‌యార‌వుతాయి. అలాగే పెద‌వులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి. అలాగే పెద‌వుల‌ను మృదువుగా ఉంచ‌డంలో తేనె కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కొద్దిగా తేనెను తీసుకుని పెద‌వుల‌పై రాసి మ‌ర్ద‌నా చేయాలి.

Cracked Lips wonderful home remedies follow these
Cracked Lips

ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వుల ప‌గుళ్లు త‌గ్గుతాయి. అలాగే పెద‌వుల‌కు కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. పెద‌వుల‌కు కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల పెద‌వుల ప‌గుళ్లు త‌గ్గుతాయి. పెద‌వులు పొడిబార‌కుండా ఉంటాయి. అలాగే పెద‌వుల‌కు నువ్వుల నూనెను కూడా రాసుకోవ‌చ్చు. వేళ్ల‌తో నువ్వుల నూనెను తీసుకుని పెద‌వుల‌పై రాసి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌గినంత తేమ ల‌భించి పెద‌వుల పగుళ్లు త‌గ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల పెద‌వుల పగుళ్లు త‌గ్గుతాయి. పెద‌వులు మృదువుగా, అందంగా త‌యార‌వుతాయి.

D

Recent Posts