ఆధ్యాత్మికం

Lord Surya Dev Mantra : రోజూ ఈ సూర్య మంత్రాన్ని చ‌ద‌వండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గుతుంది..!

Lord Surya Dev Mantra : ఆరోగ్యంగా ఉండాలని ఎవరనుకోరు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఉంటుంది. బాధలు కలగాలని, అనారోగ్య సమస్యలు రావాలని ఎవరికీ ఉండదు. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వృధానే. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సూర్యుని మంత్రాన్ని పఠించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అప్పుడు పొందొచ్చు. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి. సూర్యుడి అనుగ్రహం లభిస్తే క‌చ్చితంగా ఇబ్బందుల‌ నుండి గట్టెక్కి సంతోషంగా ఉండవచ్చు.

ప్రత్యక్ష దైవం సూర్యుడికి నమస్కారం చేసే వారిలో ఇతరుల‌ కన్నా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. సూర్య దేవుడికి నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలని చదివితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. అలానే సంపూర్ణ ఆరోగ్యం కోసం కచ్చితంగా ఈ సూర్య మంత్రాన్ని చదవండి. రోజూ ఈ సూర్య మంత్రాన్ని చదువుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు.

read this lord surya mantra to remove diseases

ఇప్పుడు రోజూ చదువుకోవాల్సిన సూర్య మంత్రం చూద్దాం.. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవిః.. అని రోజూ చదువుకోవాలి. ఇలా రోజూ మీరు ఈ శ్లోకాన్ని చదువుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇక ఈ మంత్రం యొక్క అర్ధం కూడా చూసేద్దాం.

ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే.. ఓ సూర్య దేవా! జగత్ పరిపాలికా! నీకు ఇదే నా నమస్కారములు. నీవు సర్వ లోకములను తొలగించు వాడ‌వు. శాంతిని ఇచ్చేవాడివి. నువ్వు మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.. అని దీనికి అర్థం, ఇలా ఈ పైన ఉన్న‌ మంత్రాన్ని రోజూ తప్పక చదివితే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం కలిగి సంతోషంగా ఉండవచ్చు.

Admin

Recent Posts