మొబైల్స్ తయారీదారు రియల్‌మి కొత్తగా పీ1 స్పీడ్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందించారు. 120 హెడ్జ్‌తో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే అమోలెడ్‌ది. కనుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ ఆక్టాకోర్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో అందుబాటులో ఉంది. ఈఫోన్ డిస్ప్లేకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో రెండు సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. అలాగే వెనుక వైపు 50 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ కెమెరాలు 2 ఉండగా, ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ముందు వైపు డిస్ప్లే కింద ఇచ్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ లభిస్తుంది. ఐపీ 65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను ఈ ఫోన్లో ఇచ్చారు.
ఈఫోన్లో 5జిని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా పనిచేస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి ఫీచర్లు కూడా ఈ ఫోన్లో లభిస్తున్నాయి. దీంట్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా 12జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్లను యూజర్లు రూ.15,999, రూ.18,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తోంది.