Redmi Note 11 Pro : రెడ్‌మీ నోట్ 11 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

Redmi Note 11 Pro : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రొ 5జి, రెడ్‌మీ నోట్ 11 ప్రొ పేరిట రెండు ఫోన్ల‌ను మార్చి 9వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇక ఈ ఫోన్ల‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు.

Redmi Note 11 Pro  launching on March 9th
Redmi Note 11 Pro

రెడ్‌మీ నోట్ 11 ప్రొ 5జి, రెడ్ మీ నోట్ 11 ప్రొ ఫోన్ల‌లో రెండింటిలోనూ 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. నోట్ 11 ప్రొ 5జి ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్ ఉండ‌గా.. నోట్ 11 ప్రొ ఫోన్‌లో.. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. రెండు ఫోన్ల‌లోనూ 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్లు ల‌భిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

ఈ రెండు ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. రెండు ఫోన్ల‌లోనూ వెనుక వైపు 108 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక 5జి వేరియెంట్‌లో వెనుక ఇంకో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ను అద‌నంగా ఇచ్చారు. రెండు ఫోన్ల‌లోనూ ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఈ రెండు ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంటుంది. 5జి వేరియెంట్‌లో 5జి ల‌భిస్తుంది. రెండు ఫోన్ల‌లోనూ డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.. ఫీచ‌ర్లు లభిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ల‌ను అమెజాన్‌తోపాటు షియోమీ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తారు. మార్చి 9వ తేదీన ఈ ఫోన్లు విడుద‌ల కానుండ‌గా.. వీటి ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Share
Editor

Recent Posts