ఆధ్యాత్మికం

నక్షత్రానికి ఉండే సమస్య, వాటి పరిహారం.. మీ నక్షత్రానికి కూడా ఇప్పుడే తెలుసుకోండి..!

మనకి మొత్తం 27 నక్షత్రాలు. నక్షత్రాలను బట్టి, మనం సమస్యలని, ఆ సమస్యలకి పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక ఏయే నక్షత్రాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి..? వాటి యొక్క పరిహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారికి నిర్ణయ లోపం. శివపూజ అందుకు పరిష్కారం. భరణి నక్షత్రం వారికి అభివృద్ధి లోపం. అందుకు పరిష్కారం లక్ష్మీ పూజ. కృత్తిక నక్షత్రం వాళ్ళు అబద్ధపు మాటలు చెబుతారు. అలానే అధిక ఖర్చులు కూడా ఉంటాయి. దానికి పరిష్కారం సరస్వతీ, మహాలక్ష్మి ఆరాధన.

రోహిణి నక్షత్రం వారికి శత్రు బాధలు. అందుకు పరిష్కారం దుర్గా పూజ. మృగశిర నక్షత్రం వారికి ఊపిరి సమస్యలు. దానికి పరిష్కారం విష్ణు పూజ. ఆరుద్ర నక్షత్రం వారికి ధన నిర్ణయాల లోపం. అందుకు పరిష్కారం లక్ష్మీ, కుబేర పూజ. పునర్వసు నక్షత్రం వారికి మోసపోవడం సమస్య. అందుకు పరిష్కారం విష్ణు పూజ. పుష్యమి నక్షత్రం వాళ్ళల్లో సమస్య పిరికిగా ఉండడం. దానికి పరిష్కారం ఆంజనేయ స్వామి పూజ.

ఆశ్లేష నక్షత్రం వారికి ఉండే సమస్య అతిగా ఆలోచించడం. దానికి పరిష్కారం సరస్వతి పూజ. మఖ నక్షత్రం వారికి దిగులే పెద్ద సమస్య. దానికి పరిష్కారం హనుమాన్ పూజ. పుబ్బ నక్షత్రం వారికి పెద్ద సమస్య నిర్ణయ లోపం. శివపూజ దానికి పరిష్కారం. ఉత్తర నక్షత్రం వారికి దురదృష్టం. గణపతి పూజతో పరిష్కారంని పొందొచ్చు. హస్త నక్షత్రం వారికి అధిక మానసిక ఒత్తిడి. హనుమాన్ పూజతో పరిష్కారం ఉంటుంది.

remedies according to birth star know them

స్వాతి నక్షత్రం వారికి జీర్ణ సమస్యలు. విష్ణు పూజ చేస్తే పరిష్కారం కలుగుతుంది. విశాఖ నక్షత్రం వారికి అభివృద్ధి లోపం. లక్ష్మీ పూజ దానికి పరిష్కారం. అనురాధ నక్షత్రం వారు అసూయ, పగను పెంచుకోవడమే పెద్ద సమస్య. దత్తాత్రేయ పూజతో పరిష్కారం కలుగుతుంది. ఇతరులను మోసం చేయుట జేష్ట నక్షత్రం వారిలో సమస్య. విష్ణు పూజ దానికి పరిష్కారం. మూల నక్షత్రం వారికి భాగస్వామితో తగువులు. శివాభిషేకం దానికి పరిష్కారం. పూర్వాషాఢ‌ నక్షత్రం వాళ్లకి ఓటములు ఎక్కువగా ఉంటాయి. హనుమంతుని పూజ చేస్తే పరిష్కారం కలుగుతుంది.

ఉత్తరషాఢ‌ నక్షత్రం వారికి సంతాన సమస్యలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తే పరిష్కారాన్ని పొందొచ్చు. శ్రవణ నక్షత్రం వారికి శత్రుభాదులు. దుర్గా పూజతో పరిష్కారాన్ని పొందొచ్చు. ధనిష్ట నక్షత్రానికి ఆర్థిక సమస్యలు. లక్ష్మీ, కుబేర పూజతో పరిష్కారం కలుగుతుంది. శతభిష నక్షత్రం వారికి న్యాయపరమైన సమస్యలు. విష్ణు పూజ దానికి పరిష్కారం.

పూర్వాభాద్ర నక్షత్రానికి శత్రుభాధలు. దుర్గా పూజతో పరిష్కారాన్ని పొందొచ్చు. ఉత్తరాభాద్ర వాళ్లు దిగులు స్వభావంతో ఉంటారు. హనుమంతుడి పూజతో పరిష్కారం కలుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్లకి భాగస్వామితో తగ‌వులు. దానికి పరిష్కారం శివాభిషేకం. ఇలా ఏ నక్షత్రం వాళ్లకి ఎలాంటి సమస్యలు కలుగుతున్నాయో తెలుసుకుని.. దానికి పరిష్కారం ఇక్కడ ఉంది కాబట్టి ఈ విధంగా పాటించి, సమస్యలు లేకుండా ఉండొచ్చు.

Admin

Recent Posts