Ridge Gourd Curry : బీర‌కాయ కూర‌ను ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. వ‌ట్టి కూర‌నే తినేస్తారు..!

Ridge Gourd Curry : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటితో అనేక వంట‌ల‌ను చేసుకోవ‌చ్చు. బీర‌కాయ ప‌ప్పు, ప‌చ్చ‌డి, కూర చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తోనూ క‌లిపి కొంద‌రు వీటిని వండుతుంటారు. అయితే బీర‌కాయ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని కింద చెప్పిన విధంగా కూర‌లా ఒక్క‌సారి వండితే ఆ రుచిని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. బీర‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీడియం సైజ్ ఉన్న బీర‌కాయ‌లు – 2, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, స‌న్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌చ్చి మిర్చి – 2 (నిలువుగా చీరాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ప‌సుపు – 1 టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – అర టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర – ఒక క‌ట్ట‌.

Ridge Gourd Curry recipe in telugu very easy to make and tasty
Ridge Gourd Curry

బీర‌కాయ కూర‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా బీర‌కాయ‌ల‌పై ఉండే పొట్టు తీయాలి. త‌రువాత వాటిని శుభ్రంగా క‌డ‌గాలి. అనంత‌రం వాటి మ‌ధ్య‌లో ఉండే గుజ్జు, విత్త‌నాల‌ను తీసేసి వాటిని మెత్త‌గా క‌ట్ చేసుకోవాలి. స్ట‌వ్‌పై పాన్ పెట్టి నూనె పోసి మీడియం మంట‌పై వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత అందులో జీల‌క‌ర్ర వేసి చిట‌ప‌ట‌లాడించాలి. త‌రువాత స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి వేయించాలి. వాటిని రంగు మారే వ‌ర‌కు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌లిపి మ‌ళ్లీ వేయించాలి. ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాక అందులో స‌న్న‌గా త‌రిగిన ట‌మాటాల‌ను వేసి క‌ల‌పాలి. ట‌మాటాల‌ను మెత్త‌గా, మృదువుగా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

అనంత‌రం అందులో ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత చిన్న‌గా క‌ట్ చేసిన బీర‌కాయ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్‌ను స‌న్నని మంట‌పై ఉంచి కూర‌ను 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. కూర ఉడికిన త‌రువాత దానిపై కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన బీర‌కాయ కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల్లో తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా బీర‌కాయ కూర‌ను ఒక్క‌సారి చేసుకుంటే చాలు.. మ‌ళ్లీ మ‌ళ్లీ రుచి ఇలాగే కావాలంటారు. అంద‌రూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts