Royyala Kura : రొయ్య‌ల కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Royyala Kura : మ‌నం రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాల్లో రొయ్య‌ల కూర కూడా ఒక‌టి. ఈ కూర‌ను ఒక్కొక్క‌రు ఒక్కో పద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ రొయ్య‌ల కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను చాలా సుల‌భంగా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా అయ్యే ఈ రొయ్య‌ల కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్య‌ల కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శుభ్ర‌ప‌రిచిన రొయ్య‌లు – అర‌కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Royyala Kura recipe in telugu make in this method
Royyala Kura

రొయ్య‌ల కూర త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌ను శుభ్రంగా ప‌రిచి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, ప‌సుపు వేసి రొయ్య‌ల‌ను ఉడికించాలి. రొయ్య‌ల్లో ఉండే నీరంతా పోయే వ‌ర‌కు ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా వేగిన త‌రువాత క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఉడికించిన రొయ్య‌లు వేసి మ‌రో నిమిషం పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన రొయ్య‌లు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts