Daily Walking 30 Minutes : నడక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనలో చాలా మందికి తెలుసు. వైద్యులు కూడా రోజూ కనీసం అరగంట పాటు నడవాలని సూచిస్తూ ఉంటారు. నడవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నడవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ నిపుణులు మాత్రం రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని వారు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అసలు నడవడానికి సమయాన్ని ఎందుకు కేటాయించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ నడవడం వల్ల మెదడు చురకుగా పని చేస్తుంది. నడవడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్ విడుదల అవుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా అల్జీమర్స్, డైమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నడవడం వల్ల మన కంటి ఆరోగ్యం పెరుగుతుంది. ఇది విని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ నడవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరం రక్తప్రసరణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా నడవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజూ నడవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక రోజూ నడవడం వల్ల జీర్ణక్రియ చురుకుగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోజూ నడవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఎముకలు పెలుసుగా మారకుండా గట్టిపడతాయి. కీళ్లు బలంగా మారడంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే మనలో చాలా మంది గంటల కొద్ది కూర్చుని పని చేస్తూ ఉంటారు. అలాంటి వారి రోజూ నడవడం వల్ల వెన్నెముకకు రక్తప్రసరణ పెరగడంతో పాటు వెన్నునొప్పి తగ్గుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఒత్తిడి వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కనుక మనం రోజూ అరగంట పాటు నడిచే అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే మనం తప్పకుండా రోజూ నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.